సీఎం జగన్‌ ధాటికి టీడీపీ జెండా పీకేయడమే

2 Apr, 2021 20:05 IST|Sakshi

సాక్షి, అమరావతి: మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు చేసిన ప్రకటనపై ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమికి భయపడే పోటీ నుంచి తప్పించుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రులు కన్నబాబు, గౌతమ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు.

బాబుకు ఓటమి భయం:మంత్రి కన్నబాబు
చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది మంత్రి కన్నబాబు తెలిపారు. ఓటమి భయంతోనే చంద్రబాబు పారిపోతున్నారని చెప్పారు. గత ఎన్నికల సంఘం కమిషనర్‌ నిర్ణయాన్నే కొత్త ఎస్‌ఈసీ కొనసాగిస్తున్నారని గుర్తుచేశారు. సీఎం జగన్‌ ధాటికి చంద్రబాబు టీడీపీ జెండా పీకేయడం ఖాయమని పేర్కొన్నారు. 

ఆఫీస్‌ మూసేసుకోవచ్చు: మంత్రి గౌతమ్‌రెడ్డి
ఎన్నికల్లో పాల్గొనకపోతే పార్టీ ఎందుకు? ఇక టీడీపీ ఆఫీసును మూసేసుకోవచ్చు అని మంత్రి గౌతమ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నాయకత్వం ఎలా ఉండాలో.. సీఎం జగన్‌ను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. ఏకగ్రీవాలపై హైకోర్టు తీర్పు ఇచ్చాక.. చంద్రబాబు విభేదించడం ఏమిటి? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో వందశాతం ఓడిపోతుందనే బాబు పారిపోతున్నారని పేర్కొన్నారు.

అనైతిక రాజకీయాలు బాబుకే సాధ్యం: పెద్దిరెడ్డి
చంద్రబాబు చేతగాని తనాన్ని తమపై నెడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామంచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనైతిక రాజకీయాలు చంద్రబాబుకే సాధ్యమని స్పష్టంచేశారు. సీఎం జగన్‌ సంక్షేమ పాలనకు ప్రజలు పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో పట్టం కట్టారని, ఈ ఎన్నికల్లోనూ రిపీట్‌ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే చంద్రబాబు పారిపోతున్నారని చెప్పారు.

ఆ ప్రకటన ఓ డ్రామా: వైవీ సుబ్బారెడ్డి
చంద్రబాబు ప్రకటన ఓ డ్రామాగా టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అభివర్ణించారు. నాటకాలాడటంలో చంద్రబాబు దిట్ట అని పేర్కొన్నారు. ఓటమి భయంతోనే బాబు పోటీ నుంచి తప్పించుకుంటున్నారని తెలిపారు. సీఎం జగన్‌ సంక్షేమ పాలనను చూసి బాబు జీర్ణించుకోలేకపోతున్నారని, అన్ని వర్గాలకు గడప వద్దకే సంక్షేమ పథకాలు అందుతున్నాయని వైవీ సుబ్బారెడ్డి వివరించారు.

చదవండి: జ్యోతుల నెహ్రూ, అశోక్‌ గజపతి అసంతృప్తి
చదవండి: ఓటమి భయంతోనే బాబు ఎన్నికల బహిష్కరణ

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు