సీఎం జగన్‌ రైతుల పక్షపాతి..

6 Oct, 2020 15:35 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: తాండవ షుగర్ ఫ్యాక్టరీలో రైతులతో ఏపీ మంత్రుల బృందం సమావేశమైంది. తాండవ షుగర్ ఫ్యాక్టరీపై రైతుల అభిప్రాయాలను మంత్రులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ ‘‘రైతుల కోసం నాన్న ఒక అడుగు ముందుకు వేస్తే తాను రెండు అడుగులు ముందుకు వేస్తానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు అన్యాయం జరిగిందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతులకు మంచే జరుగుతుందని, రైతుల అభిప్రాయాలను సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువెళ్తామని కన్నబాబు తెలిపారు.(చదవండి: ప్రధానితో ముగిసిన సీఎం జగన్‌ భేటీ)

మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్సార్‌ హయాంలో రైతులకు మేలు జరిగిందని, ఆయన తనయుడు వైఎస్‌ జగన్ కూడా రైతులు కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు వైఎస్‌ జగన్‌ ఏమి చేశారో, చంద్రబాబు ఏమి చేశారో ప్రజలందరికీ తెలుసునన్నారు. రైతుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. సీఎం జగన్‌ ఆలోచన రైతులకు మేలు చేయాలన్నదేనని తెలిపారు. ‘‘టీడీపీ హయాంలో చెరుకు రైతులకు బకాయి  ఉన్న రూ.54 కోట్లును సీఎం జగన్ విడుదల చేసారు. 1 లక్షల 5 వేల టన్నుల జరిగే క్రషింగ్.. టీడీపీ హయాంలో 55 వేల టన్నులకు పడిపోయిందని’’  బొత్స సత్యనారాయణ వివరించారు.

పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ రైతుల పక్షపాతి అని, చంద్రబాబువల్లే ఎన్నికల కోసం వైఎస్‌ జగన్‌ పనిచేయరని తెలిపారు. పరిశ్రమల్లో స్థితిగతులు ప్రత్యక్షంగా తెలుసుకోమని సీఎం కమిటీ వేశారని, రైతులకు నష్టం చేయడం కోసం కమిటీ వేయలేదని అవంతి శ్రీనివాస్‌ అన్నారు. అందరికి మేలు జరిగే నిర్ణయం సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకుంటారని అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

పర్రిశమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 12 షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయని, రైతులకు ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకోమని సీఎం చెప్పారని తెలిపారు. రైతులకు సీఎం జగన్‌ రైతులకు మేలు చేస్తారు. రైతులకు మేలు జరగాలన్నదే సీఎం సంకల్పమని ఆయన తెలిపారు.

ఎంపీ వంగా గీత మాట్లాడుతూ షుగర్‌ పరిశ్రమల స్థితిగతులు తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో సీఎం కమిటీ వేశారని తెలిపారు. నష్టం వస్తే ఎలలా ముందుకెళ్లాలి అనే దానిపై కమిటీ చర్చిస్తుందన్నారు. చరిత్రలో ఎన్నడూలేని విధంగా చెరకు రైతులకు బకాయిలు చెల్లించారన్నారు. రైతులకు మేలు జరిగేలా మంత్రుల కమిటీ నిర్ణయం ఉంటుందని ఎంపీ గీత తెలిపారు.
 

మరిన్ని వార్తలు