ఏపీ: గ్లోబల్ ఎడ్యుకేషన్, స్టార్టప్‌ కాంగ్రెస్ ఎక్స్‌పో బ్రోచర్‌ విడుదల

30 Jun, 2021 12:11 IST|Sakshi

అమరావతి: గ్లోబల్ ఎడ్యుకేషన్, స్టార్టప్‌ కాంగ్రెస్ ఎక్స్‌పో బ్రోచర్‌ను మంత్రులు ఆదిమూలపు సురేష్‌, గౌతమ్‌రెడ్డి బుధవారం విడుదల చేశారు. టెక్‌మార్క్‌ ఇండియా సౌజన్యంతో నవంబర్ 18, 19, 20న విశాఖలో సదస్సు నిర్వహించనున్నారు. ఇక విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులతో పాటు.. ఉద్యోగ అవకాశాలపై సీఎం వైఎస్ జగన్ దృష్టి సారించారు. రాబోయే రోజుల్లో ఏపీ విద్యా నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా.. ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలను ఆకర్షించే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. బాబు వస్తే జాబు వస్తుందనే ఆర్భాటపు ప్రచారాలు చేసిన ప్రభుత్వాలను చూశామని అన్నారు. కానీ, సీఎం జగన్ నాయకత్వంలో హామీలకు మించి చేస్తున్నామని పేర్కొన్నారు. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా లక్షలాది ఉద్యోగాలిచ్చామని మంత్రి సురేష్‌ వెల్లడించారు. దేశంలోనే ఇప్పటిదాకా ఎవరూ చేయని విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్టార్టప్‌ ఇండియా, ఆత్మనిర్భర్ లక్ష్యాలను అందుకోవడానికి ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలిపారు. 

ఇక మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, విద్యా నైపుణ్యం, స్టార్టప్‌ హబ్‌గా  అభివృద్ధి వైపు పరుగులుతీస్తోందని తెలిపారు. అంతేకాకుండా సాంకేతికతతోనే చిన్నారులకు, యువతకు భవిష్యత్తు అని అన్నారు. విద్యకు.. టెక్నాలజీ, నైపుణ్యం జోడించినప్పుడే మరింత ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. డిజిటల్ లైబ్రరీ, ఇంటర్నెట్, టెక్నాలజీ, నైపుణ్యాలకు పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు.

చదవండి: 
AP: కాసేపట్లో రాష్ట్ర కేబినెట్‌ భేటీ
AP: కృష్ణానది కరకట్ట పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన

మరిన్ని వార్తలు