కరోనా బాధితులను వేధిస్తే సహించం: పెద్దిరెడ్డి

25 Apr, 2021 12:49 IST|Sakshi

కరోనా కట్టడిపై తిరుపతిలో మంత్రుల సమీక్ష

అవసరాన్ని బట్టి కాలేజీలను కోవిడ్ ఆస్పత్రులుగా మారుస్తాం

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సాక్షి, తిరుపతి: కరోనా కట్టడిపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి హాజరయ్యారు. సమీక్ష అనంతరం మీడియాతో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ, కరోనా పేరుతో బాధితులను వేధిస్తే సహించమని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వైద్యం చేయాలని ఆయన స్పష్టం చేశారు.

రెమిడెసివర్ ఇంజక్షన్లు బ్లాక్‌లో విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఆక్సిజన్ స్టోరేజీపై ప్రత్యేక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. టెస్టులు చేసిన రోజే రిపోర్ట్‌ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముందు జాగ్రత్తగా అదనంగా వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అవసరాన్ని బట్టి కాలేజీలను కోవిడ్ ఆస్పత్రులుగా మారుస్తామని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు.

చదవండి: ప్రభుత్వాసుపత్రి సిబ్బందిపై మంత్రి సీరియస్‌
అమ్మా నన్ను ఎందు‘కని’ పడేశారు..? 

మరిన్ని వార్తలు