నెల్లూరులో మంత్రుల బృందం పర్యటన

24 Jul, 2021 14:29 IST|Sakshi

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

సాక్షి, నెల్లూరు: మంత్రుల బృందం నెల్లూరులో శనివారం పర్యటించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌ శంకుస్థాపన చేశారు.

కావలిలో రూ.86 లక్షలతో నిర్మించిన అగ్రి, ఆక్వా కల్చర్‌ ల్యాబ్‌.. తాళ్లపాలెంలో రూ.45 లక్షలతో నిర్మించిన సచివాలయం, ఆర్బీకే.. తుమ్మలపెంటలో రూ.64 కోట్లతో జలజీవన్‌ మిషన్‌ను మంత్రులు ప్రారంభించారు. జల జీవన్‌ మిషన్‌తో 240 గ్రామాలకు తాగునీటి సమస్య తీరనుంది. ఆముదాల దిన్నెలో రూ.15 లక్షలతో నిర్మించిన సైడ్‌ డ్రైన్‌ను కూడా ప్రారంభించారు.

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా..
ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్ పనిచేస్తున్నారన్నారు. మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ, సీఎం జగన్ పాలనలో సంక్షేమం పరుగులు పెడుతోందన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు.

మరిన్ని వార్తలు