ఎంఎల్‌హెచ్‌పీలకు జోన్‌–2లోనే  ఎక్కువ ఖాళీలు

17 Aug, 2022 03:36 IST|Sakshi

1,681 ఎంఎల్‌హెచ్‌పీల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్‌

ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 658 పోస్టులు 

వైద్య శాఖ వెల్లడి

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లలో సేవలు అందించడానికిగాను 1,681 మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి వైద్య శాఖ ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 9 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోన్న క్రమంలో 4 జోన్‌ల వారీగా ఖాళీలను వైద్య శాఖ వెల్లడించింది. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణాజిల్లాలను కవర్‌ చేసే జోన్‌–2లో 643 బ్యాక్‌లాగ్, 15 జనరల్‌ ఖాళీలు కలిపి 658 పోస్టులు భర్తీ చేయనుంది.

ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కవర్‌ చేసే జోన్‌–3లో 452 బ్యాక్‌లాగ్, 42 జనరల్‌ ఖాళీలు కలిపి 494 ఖాళీలున్నాయి. ఉమ్మడి చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూల్‌ జిల్లాలతో కూడిన జోన్‌–4లో 245 బ్యాక్‌లాగ్, 51 జనరల్‌ ఖాళీలు కలిపి 296 పోస్టులున్నాయి. జోన్‌–1లోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో 222 బ్యాక్‌లాగ్, 11 జనరల్‌ ఖాళీలతో కలిపి 233 పోస్టులున్నాయి. hmfw.ap.gov.in వెబ్‌సైట్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు ఈ నెల 22 వరకు గడువు ఉంది. ఈ నెల 24 నుంచి 30 వరకు హాల్‌ టికెట్లు జారీ చేసి సెప్టెంబర్‌ మొదటి వారంలో ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష తేదీ హాల్‌టికెట్‌లో తెలియజేస్తారు. పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్‌ ఆధారంగా ఎంపికలుంటాయి.
చదవండి: మునుపెన్నడూ  ఇటు చూడని  పారిశ్రామిక  దిగ్గజాలు.. ఇప్పుడు ఏపీకీ వస్తున్నారు

మరిన్ని వార్తలు