నిమ్మకూరులో వైఎస్సార్‌సీపీ విజయం 

20 Sep, 2021 09:13 IST|Sakshi

నిమ్మకూరు (పామర్రు): టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ స్వగ్రామమైన నిమ్మకూరులో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి దాసరి అశోక్‌కుమార్‌ జయకేతనం ఎగురవేశారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పాలనకు ప్రజలు ఆకర్షితులై వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలిచారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అశోక్‌కుమార్‌ తన ప్రత్యర్థి వీరాంజనేయులుపై తొలుత రెండు ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీనికి ప్రత్యర్థి రీ కౌటింగ్‌ జరపాలని డిమాండ్‌ చేయగా రీ కౌంటింగ్‌లో అశోక్‌కుమార్‌కు మరో 6 ఓట్లు ఆధిక్యం రాగా మొత్తం 8 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు.

చదవండి: ప్రజాప్రయోజనాలకే పెద్దపీట

మరిన్ని వార్తలు