ఏయ్‌ ఎస్సై నన్నే ఆపుతావా: కొల్లు రవీంద్ర

10 Mar, 2021 16:56 IST|Sakshi

పోలింగ్‌ కేంద్రం వద్ద కొల్లు రవీం‍ద్ర దౌర్జన్యం

పోలీసులపై దాడి

కృష్ణా: తెలుగు దేశం నేత కొల్ల రవీంద్ర పోలింగ్‌ సెంటర్‌ వద్ద వీరంగం సృష్టించాడు. ఓటింగ్‌ ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. తనను పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లకుండా అడ్డుకున్నందుకు ఏకంగా విధుల్లో ఉన్న ఎస్‌ఐపై చేయి చేసుకున్నాడు. ఆ వివరాలు.. మచిలిపట్నం 25వ డివిజన్‌ సర్కిల్‌పేటలోని పోలింగ్‌ కేంద్రానికి టీడీపీ నేత కొల్లు రవీంద్ర, మరి కొందరి కార్యకర్తలతో కలిసి వచ్చాడు. తాను లోపలికి వెళ్లి పోలింగ్‌ సరళిని పరిశీలించాలంటూ హాడావుడి చేసే ప్రయత్నం చేశాడు. దాంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు 144 సెక్షన్‌ అమల్లో ఉందని.. కనుక ఆయన లోపలికి వెళ్లడానికి కుదరదని కొల్లు రవీంద్రకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. 

ఈ క్రమంలో కొల్లు రవీంద్ర పోలీసులపై విరుచుకుపడ్డాడు.. ‘‘ఏయ్‌ ఎస్పై నన్ను ఆపుతావా’’ అంటూ బెదిరించడమే కాక.. ‘‘చంపుతావా.. చంపు’’ అంటూ ఎస్‌ఐ మీదకు వెళ్లాడు. వారిని వెనక్కి నెట్టాడు. నేను లోపలికి వెళ్లి పోలింగ్‌ సరళిని పరిశీలించాలంటూ వారితో వాదనకు దిగాడు. ఈ క్రమంలో టీడీపీ నేతల దౌర్జన్యాన్ని అరికట్టాలని.. ఇలాంటి చర్యలు జరగకుండా చూడాలని జనాలు కోరుతున్నారు. 

చదవండి:

బరి తెగించిన టీడీపీ: దొంగ ఓట్లు వేయించేందుకు యత్నం

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు