ఏపీ కొత్త మంత్రులు: ఇంగ్లీష్‌లో ప్రమాణం చేసింది వీరే..

11 Apr, 2022 13:06 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రులు కొలువుదీరారు. 25 మంది మంత్రుల చేత రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రితో మంత్రులుగ్రూపు ఫొటో దిగారు. ఆ వెంటనే సచివాలయంలో గవర్నర్, సీఎం, కొత్త, పాత మంత్రులు, అధికారులు తేనీటి విందులో పాల్గొన్నారు.

చదవండి:  AP: మంత్రుల ప్రమాణ స్వీకారం.. తొలుత ప్రమాణం చేసింది ఆయనే..

మంత్రులుగా అంబటి రాంబాబు, అంజాద్‌ బాషా, ఆదిమూలపు సురేష్‌, బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, బుగ్గన రాజేంద్రనాథ్‌, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్‌నాథ్‌, గుమ్మనూరు జయరాం, జోగి రమేష్‌, కాకాణి గోవర్థన్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామి, ఉషాశ్రీ, చరణ్‌, మేరుగ నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపే విశ్వరూప్‌, పి.రాజన్న దొర, ఆర్కే రోజా, తానేటి వనిత, సీదిరి అప్పలరాజు, విడదల రజినీ మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్‌, ఉషాశ్రీ చరణ్‌ ఆంగ్లంలో ప్రమాణం చేశారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు