Cyclone Yaas: అదనంగా 400 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌

27 May, 2021 16:33 IST|Sakshi

ఆక్సిజన్‌ కొరత లేకుండా చర్యలు

ప్రైవేట్‌ సెక్టార్‌లో ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్మాణానికి పాలసీ: కృష్ణబాబు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ కృష్ణబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 32వేల ఆక్సిజన్‌ బెడ్స్‌కి 660 మెట్రిక్‌ టన్నులు ప్రాణ వాయువు కావాలి. కానీ కేంద్రం ఇచ్చేది 590 మెట్రిక్‌ టన్నులు మాత్రమే. దాంతో ప్రతిరోజూ అదనంగా 150 మెట్రిక్‌ టన్నులు తీసుకొస్తున్నాం’’ అన్నారు కృష్ణబాబు.

‘‘యస్‌ తుపాను వల్ల ఇబ్బందులొస్తాయని ముందస్తుగా.. అదనంగా 400 మెట్రిక్‌ టన్నుల వరకు ఆక్సిజన్ తీసుకొచ్చాం. ఇప్పటివరకు జామ్‌నగర్‌ నుంచి నాలుగు ఆక్సిజన్‌ రైళ్లు వచ్చాయి. ఆక్సిజన్‌ రవాణా కోసం 92 లారీలను వినియోగిస్తుండగా.. సరఫరా కోసం 16 కంటైనర్లను ఏర్పాటు చేశాం. ప్రైవేట్‌ సెక్టార్‌లో ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్మాణానికి సీఎం పాలసీని ప్రకటించారు. 120 కోట్ల రూపాయలతో ఆస్పత్రుల్లో ప్లాంట్ల నిర్మాణానికి టెండర్లు పిలుస్తున్నాం అని కృష్ణబాబు తెలిపారు. 

మరిన్ని వార్తలు