నిమ్మగడ్డకు షాకిచ్చిన కంపసముద్రం గ్రామస్తులు

8 Feb, 2021 20:46 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: మంత్రి గౌతమ్‌రెడ్డి ఇలాకలో పంచయతీ ఎన్నికలు సంచలనంగా మారాయి. గుంటూరు, చిత్తూరు జిల్లాలలో పెద్ద సంఖ్యలో జరిగిన ఏకగ్రీవాలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. దీంతో పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలపై కంపసముద్రం గ్రామస్తులు తిరగుబాటు చేశారు. ఏకగ్రీవాలపై ఆయన చేసిన ప్రకటన నేపథ్యంలో ఎన్నికలు బహిష్కరించాలని గ్రామస్తులు తీర్మాణం తీసుకుని ఎస్‌ఈసీకి షాక్‌ ఇచ్చారు. నిమ్మగడ్డ ఎసీఈసీగా ఉన్నంతకాలం పంచాయతీ ఎన్నిక వద్దంటూ గ్రామస్తులు తీర్మాణించడంతో అభ్యర్థులు నామినేషన్‌లను ఉపసంహరించుకున్నారు. కాగా సర్పంచ్‌ స్థానానికి మొదట 8 మంది అభ్యర్థులు నామినేషన్‌ వేయగా వారంతా గ్రామస్తుల తీర్మాణంతో నామినేషన్‌ను ఉపంసహరించుకున్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు