గ్రామ, వార్డు సచివాలయాల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

29 Jul, 2021 18:36 IST|Sakshi

సాక్షి, అమరావతి: డీజీపీ ఆదేశాల మేరకు డీ‌ఐజీలు, ఎస్పీలు ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాలను ఆకస్మికంగా సందర్శించి, రికార్డులను తనిఖీ చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో అందిస్తున్న సేవలతో పాటు గ్రామ, వార్డు సచివాలయంలో వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది, వారి విద్యార్హతలు, వారు అందించే సేవలను అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ నుంచి స్వయంగా వివరాలను తెలుసుకున్నారు. సచివాలయాల పరిధిలో నివసించే ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే వివిధ పథకాలను అర్హత కలిగిన వారికి అందేలా చేస్తున్న చర్యలను పరిశీలిస్తున్నారు.

సచివాలయాల పరిధిలో నివసిస్తున్న మహిళల రక్షణకు, సైబర్‌ నేరాల నియంత్రణకు, అసాంఘిక కార్యక్రమాల నియంత్రణకు చేపడుతున్న అవగాహన కార్యక్రమాలను మహిళా పోలీసులు అధికారులకు వివరించారు. మహిళా పోలీసుల సేవలతో ప్రజలకు పోలీసు శాఖ మరింత చేరువయ్యేందుకు అవసరమైన చర్యలు, కార్యాచరణ చేపడతామని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు