తీరిన బొగ్గు కొరత.. ఏపీలో ఇక నిరంతరాయ విద్యుత్‌ సరఫరా

18 May, 2022 15:45 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కానుంది. మరోవైపు పరిశ్రమలకు విద్యుత్ కోతల వేళలు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది.

మే 9 నుంచి పరిశ్రమలకు పవర్ హాలిడే ఉపసంహరణ కొనసాగుతోందని ప్రభుత్వం తెలిపింది. అలాగే ఈ నెల 16వ తేదీ నుంచి పరిశ్రమలకు పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా ఇస్తున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు కొరత వలన కొద్దిరోజుల పాటు పరిశ్రమలకు విద్యుత్ పంపిణీ లో సమస్యలు తలెత్తాయని, ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడటంతో అన్ని రంగాల వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.

>
మరిన్ని వార్తలు