‘వ్యాక్సిన్ల కొరత.. డబ్బులిచ్చి కొందామన్న లభించడం లేదు’

10 May, 2021 19:13 IST|Sakshi

వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ వెల్లడి

సాక్షి, అమరావతి: ఆరోగ్య శ్రీ  ద్వారా కోవిడ్‌ బాధితులకు వైద్యం అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్‌ సింఘాల్ తెలిపారు. వ్యాక్సిన్ కొరత నేపథ్యంలో సెకండ్‌ డోస్‌ వారికి మాత్రమే టీకాలు వేస్తున్నట్లు స్పష్టం చేస్తున్నారు. కేంద్రం నుంచి స్టాక్‌ వచ్చిన వెంటనే అందరికీ వ్యాక్సిన్లు వేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కోటా ప్రకారం రాష్ట్రాలకు కేంద్రమే వ్యాక్సిన్లు సరఫరా చేస్తోందన్నారు. డబ్బులిచ్చి కొందామన్న లభించని పరిస్థితి నెలకొందని అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెమిడెసివిర్ అందుబాటులో ఉందని, ప్రైవేటు ఆస్పత్రులకు కూడా రెమిడెసివిర్ సరఫరా చేస్తున్నాని పేర్కొన్నారు. కోవిడ్ కాల్‌ సెంటర్‌ ద్వారా బాధితులకు అండగా నిలుస్తున్నామన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ.. వారికి అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నామని తెలిపారు.

చదవండి: బాబు, లోకేష్ అసలు వ్యాక్సిన్‌ వేయించుకున్నారా..?

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు