‘మహిళా పక్షపాతిగా సీఎం జగన్ దేశానికే ఆదర్శం’

22 Jul, 2021 15:16 IST|Sakshi

సాక్షి, అమరావతి: మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో పథకాలు ఇచ్చారని ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అన్నారు. దేశంలో ఏ సీఎం ప్రోత్సహించని రీతిలో మహిళలను సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు. పథకాలు, పదవుల్లోనూ మహిళలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యతిచ్చారని ప్రశంసించారు. మహిళల పుట్టుకనే చంద్రబాబు అవహేళన చేశారన్న డిప్యూటీ సీఎం.. మహిళలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యతిచ్చారని ప్రశంసించారు. మహిళా పక్షపాతిగా సీఎం జగన్ దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు