ఏపీ నంబర్‌–1.. సూపర్‌ మత్స్యం

10 Jan, 2023 09:41 IST|Sakshi

సాక్షి, అమరావతి: చెరువులు, కాలువలు వంటి నీటి వనరుల్లో (ఇన్‌ల్యాండ్‌) చేపలను ఉత్పత్తి చేయడంలో అగ్రపథాన నిలిచింది. ఇన్‌ల్యాండ్‌లో 42.19 లక్షల టన్నుల చేపల ఉత్పత్తితో ఏపీ మొదటి స్థా­నం­లో నిలవగా.. ఆ తర్వాత 16.52 లక్షల టన్నులతో పశ్చిమ బెంగాల్, 8.09 లక్షల టన్నులతో ఉత్తరప్రదేశ్, 7.89 లక్షల టన్నులతో ఒడిశా, 7.62 లక్షల టన్నులతో బిహార్‌ వరుస స్థానాలు పొందాయి. కాగా, సముద్ర మత్స్య ఉత్పత్తుల్లో 7.02 లక్షల ట­న్ను­లతో గుజరాత్‌ మొదటి స్థానం, 6.01 లక్షల ట­న్ను­లతో కేరళ రెండోస్థానం, 5.95 లక్షల టన్నులతో తమిళనాడు మూడో స్థానంలో ఉండగా.. 5.94 ల­క్షల టన్నులతో ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. 

జాతీయ సగటుతో పోలిస్తే ఏపీ టాప్‌
చేపల ఉత్పత్తిలో 2021–22 సంవత్సరానికి సంబంధించి జాతీయ సగటు వృద్ధి రేటుతో పోలిస్తే.. ఆంధ్రప్రదేశ్‌ దాదాపు రెట్టింపు వృద్ధి రేటు నమోదు చేసింది. జాతీయ స్థాయిలో వృద్ధి రేటు 6.61 శాతంగా నమోదు కాగా.. ఆంధ్రప్రదేశ్‌ ఏకంగా 12.57 శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతోంది. 20కి పైగా రాష్ట్రాల్లో ఏపీలో ఉత్పత్తి అవుతున్న చేపలకే డిమాండ్‌ అధికంగా ఉంది. స్థానికంగా ఉత్పత్తి అయ్యే చేపల్లో 20 లక్షల టన్నులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. 2021–22లో 48.13 లక్షల టన్నుల ఉత్పత్తితో రూ.59,188 కోట్ల జీవీఏ (జోడించబడిన స్థూల విలువ) సాధించింది. 

(చదవండి: ఆక్వాకు ఉజ్వల భవిత..స్టేక్‌ హోల్డర్స్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు)

మరిన్ని వార్తలు