ఏపీ సచివాలయ వ్యవస్థ సరికొత్త రికార్డు

5 Oct, 2021 12:54 IST|Sakshi

గ్రామ వార్డు సచివాలయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్

సాక్షి, విజయవాడ: ప్రజాపాలనలో ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ వ్యవస్థ సరికొత్త రికార్డు సృష్టించిందని గ్రామ వార్డు సచివాలయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్ తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మట్లాడుతూ.. రాష్ట్రంలో 3.2 కోట్ల మందికి సేవలు అందించిన సచివాలయాలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు కొత్త నిర్వచనంగా నిలిచాయని తెలిపారు. రాష్ట్రంలో రెండేళ్లలోనే 15,004 సచివాలయల ద్వారా 543సేవలు, 34సంక్షేమ పథకాల అమలవుతున్నాయని పేర్కొన్నారు. సచివాలయాలు పని తీరును ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని తెలిపారు.

చదవండి: ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

99శాతం సేవలను సీఎం వైఎస్‌ జగన్ చెప్పిన సమయంలోనే అందిస్తున్నామని అన్నారు. త్వరలో సచివాలయంలో 150 కేంద్ర ప్రభుత్వ సేవలను కూడా అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. 500 సచివాలయాల్లో ఆధార్ సేవలు ప్రారంభించామని తెలిపారు. రిజిస్ట్రేషన్లు కూడా సచివాలయంలో ప్రారంభిస్తామని తెలిపారు. తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాలు ఈ వ్యవస్థను పరిశీలించాయని అజయ్‌ జైన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు