తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని రాజపక్సే

24 Dec, 2021 11:40 IST|Sakshi

సాక్షి, తిరుమల:  శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే కుటుంబ సమేతంగా శుక్రవారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం తిరుమలలోని శ్రీకృష్ణ విశ్రాంతి గృహం వద్దకు ఆయనకు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, టీటీడీ ఏఈవో ఎవీ ధర్మారెడ్డి, తదితరులు స్వాగతం పలికారు. అంతకముందు రేణిగుంట విమానాశ్రయంలో మహింద రాజపక్సేకు సాదర స్వాగతం లభించింది. విమనాశ్రయంలో వారిని భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా నృత్య ప్రదర్శనలతో విద్యార్థులు స్వాగతం పలికారు. 

(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

మరిన్ని వార్తలు