AP SSC 10th Results 2022: టెన్త్‌ ఫలితాల విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..

6 Jun, 2022 12:58 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఫలితాలను విడుదల చేశారు. ఈ సారి మార్కుల రూపంలో ఫలితాలను ప్రకటించారు. రికార్డు స్థాయిలో త‌క్కువ‌ రోజుల్లోనే విద్యాశాఖ ఈ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. 4,14,281 మంది ఉత్తీర్ణులయ్యారు. 67.26 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఏపీ 10వ త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ డైరెక్ట్ లింక్ ఇదే..(Click Here)

టెన్త్‌ ఫలితాల్లో  బాలికలే పైచేయి సాధించారు. 78.3 శాతంలో ప్రకాశం జిల్లా మొదటిస్థానం దక్కించుకోగా, 49.7 శాతంతో అనంతపురం జిల్లా చివరి స్థానంలో ఉంది. 64.02 శాతం బాలురు, 70.70 శాతం బాలికలు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 67.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 797 స్కూళ్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 71 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్‌ కాలేదు.

జులై 6 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
జులై 6 నుంచి 15వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. రేపటి నుంచి సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ నెల 13 నుంచి వారికి స్పెషల్ కోచింగ్ క్లాసులు కూడా పెడుతున్నామని తెలిపారు.

ఏప్రిల్‌ 27న ప్రారంభమైన టెన్త్‌ పరీక్షలు మే 9న పూర్తయ్యాయి. ఈసారి 6,22,537 మంది పదో తరగతి పరీక్షలు రాశారు. ప‌దో త‌ర‌గ‌తి పరీక్ష పత్రాలను సకాలంలో మూల్యాంకనం చేయ‌డం కోసం.. 20 వేల మంది ఉపాధ్యాయులకు విధులను కేటాయించారు. ఏపీ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్‌లో చూడొచ్చు.
ఏపీ 10వ త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ డైరెక్ట్ లింక్ ఇదే..(Click Here)

మరిన్ని వార్తలు