10th Class Result 2022: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..

5 Jun, 2022 17:41 IST|Sakshi

AP SSC 10th Result 2022: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పదో తరగతి పరీక్షల ఫలితాలు జూన్ 6వ తేదీన (సోమ‌వారం) మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఫలితాలు విడుదల చేసిన అనంతరం మాట్లాడారు. టెన్త్‌ ఫలితాల్లో 67.26 శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. ఫలితాల్లో బాలికలదే పైచేయి అని వెల్లడించారు. బాలికలు 70.70 శాతం, బాలురు 64.02 శాతం మంది పాస్‌ అయ్యారని పేర్కొన్నారు. 797 స్కూళ్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయని మంత్రి బొత్స తెలిపారు.

ఏపీ 10వ త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ డైరెక్ట్ లింక్ ఇదే..(Click Here)

వాస్తవానికి టెన్త్‌ ఫలితాలు జూన్ 4వ తేదీన (శనివారం) ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ విడుదల చేయాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాలతో ఈ ఫలితాలను విడుదల చేయలేకపోయినట్లు విద్యాశాఖ డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇదిలాఉండగా.. ఏప్రిల్‌ 27న ప్రారంభమైన టెన్త్‌ పరీక్షలు మే 9న పూర్తయ్యాయి. ఈసారి 6,22,537 మంది పదో తరగతి పరీక్షలు రాశారు. ప‌దో త‌ర‌గ‌తి పరీక్ష పత్రాలను సకాలంలో మూల్యాంకనం చేయ‌డం కోసం.. 20 వేల మంది ఉపాధ్యాయులకు విధులను కేటాయించారు. ఏపీ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్‌లో కూడా చూడొచ్చు.

మరిన్ని వార్తలు