అమ్మకు చేదోడుగా..

22 Aug, 2022 08:28 IST|Sakshi

విశాఖపట్నం: అమ్మ అనునిత్యం పిల్లల కోసం పరితపిస్తుంది... ఉదయం లేచింది మొదలు ప్రతి నిమిషం పనిలోనే.. పిల్లలను తయారు చేసి బడికి పంపి తిరిగి ఇంటికి చేరే వరకు వారి మీదే ధ్యాస. స్కూల్లో ఎలా ఉన్నారో..? బాగా చదువుతున్నారా..? వారిని మంచి ప్రయోజకులను చేయాలని ఆరాటం. అనుక్షణం తమ కోసం తపన పడుతున్న అమ్మకు సాయం చేసే అవకాశం వచ్చింది. ఆర్కే బీచ్‌లో మొక్కజొన్నలు అమ్మే ఓ అమ్మకు పని పడింది. 

కచ్చితంగా వెళ్లాలి...వెళితే వ్యాపారం పోతుంది...ఇటువంటి సమయంలో అమ్మా నేనున్నా...నువ్వెళ్లిరా...అంటూ కన్నపేగు మాటలకు ఆ తల్లి ధనలక్ష్మి మురిసిపోయింది. స్కూల్‌లో ఇచ్చిన హోంవర్కు చేసుకుంటూ మొక్క జొన్న కంకులు అమ్ముతూ ఇలా కనిపించింది ఆరో తరగతి చదువుతున్న భవాని భార్గవి. తండ్రి కూలి పనులు చేస్తుండగా..తల్లి పాచి పనులు చేసుకుంటూ సాయంత్రం వేళ బీచ్‌లో మొక్కజొన్న కంకులు అమ్ముతోంది. తనకు జగనన్న అమ్మ ఒడి అందుతోందని భార్గవి చెప్పింది. ఈ చదువుల సిరిని చూసి బీచ్‌కొచ్చినవాళ్లు అభినందించారు. 

మరిన్ని వార్తలు