‘మహిళా సంరక్షణ కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది’

24 Sep, 2021 14:52 IST|Sakshi

సాక్షి,అమరావతి: మహిళా సాధికారత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి సత్ఫాలితాలు ఇస్తున్నాయని మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ చెప్పారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో దిశ చట్టం ద్వారా మహిళలపై జరుగుతున్న దాడులు అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కొనియాడారు. దిశ చట్టం అమలుకై కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని తెలిపారు.

దిశ పేపర్లను లోకేష్‌ కాల్చేసిన సమయంలో చాలా బాధగా అనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు మహిళా అధికారి పై బహిరంగంగా దాడి చేసినా చర్యలు లేవని, అయితే మహిళా సంరక్షణ కోసం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని పేర్కొన్నారు. మహిళలు ముఖ్యంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్మార్ట్ ఫోన్ల వినియోగ సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

వీటిపై త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలలు, పాఠశాలలో అవగాహన కూడా కల్పిస్తామన్నారు. ఆపద సమయంలో దిశ యాప్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలుపుతూ.. రాష్ట్రాలు దాటి ఢిల్లీలో దిశ యాప్ ద్వారా జిల్లాకి చెందిన మహిళను సురక్షితంగా కాపాడిన ఘటనను ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.

చదవండి: ఆ.. పిల్లలను ఆదుకుంటాం 

మరిన్ని వార్తలు