ఏపీఐఐసీ కీలక నిర్ణయం.. పారిశ్రామికవేత్తలకు భారీ ఊరట

28 Jun, 2022 20:30 IST|Sakshi

పన్ను బకాయిలు ఒకేసారి చెల్లిస్తే 5 శాతం తగ్గింపు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగించేలా ఏపీఐఐసీ కీలక నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక యూనిట్లు చెల్లించాల్సిన పన్ను బకాయిలను ఒకేసారి కట్టేస్తే 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఏపీఐఐసీ ప్రకటించింది. ఏటా ఒకేసారి పన్ను చెల్లించే వారికి కూడా 5 శాతం డిస్కౌంట్‌ ఇవ్వనుంది. బోర్డు తీసుకున్న నిర్ణయం మేరకు ఏపీఐఐసీ ఈ ఉత్తర్వులిచ్చింది.  

రాయితీ మార్గదర్శకాలను సీజీజీ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ఏపీఐఐసీ ఉంచింది. 2022–23 సంవత్సరానికి ఆస్తి పన్నును బకాయిలతో కలిపి జూలై 31వ తేదీలోగా చెల్లించిన వారికి ఈ తగ్గింపు వర్తిస్తుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న పారిశ్రామికవాడలకు ఇది వర్తిస్తుంది. అర్బన్‌ ఐలాల్లో మాత్రం జూన్‌ 30 లోపు చెల్లించిన వారికి  పెనాల్టీలో కూడా తగ్గింపు ఇస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ప్రస్తుతం రూ.60 కోట్ల పన్ను బకాయిలు ఉన్నట్లు ఏపీఐఐసీ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా ఏప్రిల్‌ 30 లోపు పన్ను చెల్లిస్తే 5 శాతం తగ్గింపు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ విధానంలోనే ఆస్తి పన్ను వసూలు చేసేలా జోనల్‌ మేనేజర్లు, ఐలా కమిషనర్లకు ఏపీఐఐసీ వీసీ, ఎండీ సుబ్రమణ్యం జవ్వాది మార్గదర్శకాలిచ్చారు.   

చదవండి: (ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరో 3 లక్షల మందికి కొత్త పింఛన్లు)

మరిన్ని వార్తలు