ఉద్యోగులకు సీఎం వైఎస్‌ జగన్ తీపి కబురు

23 Oct, 2020 18:06 IST|Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు: ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు

సాక్షి, అమరావతి: తమ సమస్యల గురించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించారని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కోవిడ్‌ కారణంగా రెండు నెలల పాటు తగ్గించిన డిఫర్‌ జీతాలు ఇచ్చేందుకు అంగీకరించినట్లు వెల్లడించారు. అదే విధంగా సీపీఎస్‌ అమలు, పీఆర్‌సీ విషయంలో కూడా సీఎం సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ఇందుకు ఉద్యోగుల అందరి తరఫున ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. కాగా ఏపీ ఎన్జీవో ముఖ్యనేతలు నేడు సీఎం జగన్‌ను కలిశారు. (చదవండి: సమగ్ర భూ సర్వేతో శాశ్వత భూ హక్కు)

ఈ భేటీ అనంతరం చంద్రశేఖర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. ప్రతి ఉద్యోగికి రిటైర్ అయ్యేలోపు ఇంటి స్థలాలను ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. కోవిడ్ సోకిన ఉద్యోగులకు 30 రోజుల ప్రత్యేక సెలవు ఇవ్వాలని అడిగామని, ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. అదే విధంగా డిఫర్ జీతాలు, పెన్షన్లు, రెండు డీఏలు నవంబరు నెలలో ఇచ్చేందుకు అంగీకరించినట్లు వెల్లడించారు. అన్ని రకాల సౌకర్యాలు, రాయితీలు ఇవ్వటానికి సీఎం అంగీకరించారని సంతోషం వ్యక్తం చేశారు. ఇక నాల్గవ తరగతి ఉద్యోగుల వయోపరిమితి 62 ఏళ్ళకు పెంచేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సానుకూలంగా ఉన్నారని సంఘం ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు అన్నారు. మహిళా ఉద్యోగులకు ఐదు రోజులు సెలవులు ఇవ్వాలని కోరామని తెలిపారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు