ఏపీపీఎస్సీ మరో 2 నోటిఫికేషన్లు

1 Oct, 2021 05:18 IST|Sakshi

డీపీఆర్వో, సర్వే అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టుల భర్తీ  

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఇందులో భాగంగా గురువారం మరో 2 నోటిఫికేషన్లు విడుదల చేసింది. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ పోస్టులు 6, డిస్ట్రిక్ట్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌(డీపీఆర్వో) పోస్టులు నాలుగు భర్తీ చేయడానికి వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది.

అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ పోస్టులకు అక్టోబర్‌ 22 నుంచి నవంబర్‌ 12 వరకు, డీపీఆర్వో పోస్టులకు అక్టోబర్‌ 19 నుంచి నవంబర్‌ 9 వరకు దరఖాస్తు గడువుగా నిర్ణయించినట్లు కమిషన్‌ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు