ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతిపై కేసు పెట్టి న్యాయపోరాటం చేస్తా..

9 Jul, 2021 21:22 IST|Sakshi

తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనకు ఏపీపీఎస్సీ సభ్యునిగా పదవి ఇవ్వడంతో కొందరు తమ సంస్థపై ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారని నూతలపాటి సోనివుడ్‌ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఎంపీ రఘరామకృష్ణంరాజు తనపై కొన్ని ఛానెల్స్‌లో వ్యంగ్యంగా మాట్లాడారని గుర్తుచేశారు. గత 24 ఏళ్లుగా తమ సంస్థ అనాథ పిల్లలను చదివిస్తోందని పేర్కోన్నారు.

అదే విధంగా, తమ సంస్థచే నిర్వహిస్తున్న హస్టల్‌లో బాలికల సంరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని స్పష్టం చేశారు. తమ సంస్థపై, తనపై అసత్య ఆరోపణలు చేసిన ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతిపై మండిపడ్డారు.  వారిపై కేసు పెట్టి న్యాయపోరాటం చేస్తానని నూతల పాటి సోనివుడ్‌ అన్నారు.

మరిన్ని వార్తలు