రోడ్డెక్కిన సిటీ బస్సులు

20 Sep, 2020 04:06 IST|Sakshi
విజయవాడలో సిటీ బస్సులు

విజయవాడ, విశాఖలో 200 బస్సులు నడిపిన ఆర్టీసీ

సాక్షి, అమరావతి: కోవిడ్‌ ఆంక్షల మధ్య రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్టణంలో సిటీ బస్సులు రోడ్డెక్కాయి. ట్రయల్‌ రన్‌లో భాగంగా విజయవాడలో వంద, విశాఖపట్టణంలో వంద బస్సుల చొప్పున తిప్పారు. నేటి నుంచి పూర్తి స్థాయిలో బస్సులు తిప్పేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. రెండు నగరాల్లో కలిపి సిటీ సర్వీసు బస్సులు 1,100 వరకు ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన ప్రత్యేక మార్గదర్శకాల ప్రకారం అధికారులు బస్సుల్ని నడిపారు. 

► నగర శివారు ప్రాంతాల నుంచి మెట్రో బస్‌ సర్వీసుల్ని 70 శాతం వరకు తిప్పారు. నగరాన్ని ఆనుకుని ఉన్న పల్లెలకు పల్లెవెలుగు బస్సులు నడిపారు.
► 60 ఏళ్లు పైబడిన వారిని వ్యక్తిగత బాధ్యతతో ప్రయాణానికి అనుమతించారు. వీరికి రాయితీ నిలిపేశారు.
► ప్రతి బస్‌ స్టాప్‌ వద్ద సిబ్బందిని అందుబాటులో ఉంచి బస్సు ఎక్కేవారి టెంపరేచర్‌ పరీక్షించారు.  

మరిన్ని వార్తలు