APSRTC: పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో న్యూమాటిక్‌ డోర్లు

19 Oct, 2022 13:07 IST|Sakshi
పల్లె వెలుగు బస్సుల్లో తొలిసారిగా ఏర్పాటు చేసిన న్యూమాటిక్‌ డోర్‌

సాక్షి, అమరావతి: ప్రయాణికుల భద్రత కోసం ఏపీఆర్టీసీ మరిన్ని మెరుగైన చర్యలు తీసుకుంటున్నది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ‘న్యూమాటిక్‌ డోర్లు’ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా రెండు బస్సుల్లో ఏర్పాటు చేసిన న్యూమాటిక్‌ డోర్లను ఆర్టీసీ ఎండీ సీహెచ్‌. ద్వారకా తిరుమలరావు మంగళవారం పరిశీలించారు. 

ప్రయాణికులు తొందరపాటుతో కదులుతున్న బస్సుల్లోంచి దిగుతున్నప్పుడుగానీ ఎక్కుతున్నప్పుడుగానీ కాలుజారి పడడం వంటి ప్రమాదాలను నివారించేందుకు న్యూమాటిక్‌ డోర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ డోర్లు పూర్తిగా డ్రైవర్‌ నియంత్రణలో ఉంటాయి. బస్సు ఆగిన తరువాత డ్రైవర్‌ సీటు వద్ద ఉన్న బటన్‌ను నొక్కితేనే డోర్లు తెరుచుకుంటాయి. వర్షాలు, చలితో బస్సులోని ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఈ డోర్లు ఉపయోగపడతాయి.  


ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు డ్రైవర్లతో మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. కాగా, త్వరలోనే అన్ని పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఈ న్యూమాటిక్‌ డోర్లను ఆర్టీసీ ఏర్పాటు చేయనుంది. (క్లిక్ చేయండి: ఇదీ.. అమరావతి రాజధాని అసలు కథ)

మరిన్ని వార్తలు