ఏపీ: సంక్రాంతికి 3607 ప్రత్యేక బస్సులు

19 Dec, 2020 15:08 IST|Sakshi

సాక్షి, విజయవాడ: సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్‌ ఆర్టీసీ 3607 ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ సందర్భంగా ఏపీఎస్‌ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఆపరేషన్స్) కేఎస్‌ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ 2021 జనవరి 8వ తేదీ నుంచి 13 వరకూ పొరుగు రాష్ట్రాలు, నగరాల నుంచి రాష్ట్రానికి ప‍్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి 1251 బస్సులు నడుస్తాయని చెప్పారు. ఇక బెంగళూరు నుంచి 433, చెన్నై నుండి 133 బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇక రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుండి విజయవాడకు 201, విశాఖకు 551 బస్సులు నడపుతారు. అలాగే అంతర్గతంగా వివిధ జిల్లాల మధ్య 1038 ప్రత్యేక బస్సులు తిరుగుతాయి.

మరిన్ని వార్తలు