శ్రీశైలం భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ 

8 Feb, 2023 05:28 IST|Sakshi

రోజూ 1,075 దర్శనం టికెట్లు 

రేపటి నుంచి అమలులోకి..  

సాక్షి, అమరావతి: శ్రీశైలం వెళ్లే భక్తుల­కు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ ప్రవేశపెట్టింది. రోజూ 1,075 దర్శనం టికెట్లు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ అందిస్తోంది. తాజాగా ఈ నెల 9 నుంచి శ్రీశైలం భక్తులకు కూడా ప్యాకేజీని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు దేవదాయ శాఖతో ఒప్పందం చేసుకుంది. వాటిలో స్పర్శ, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనం టికెట్లు ఉన్నాయి. రూ.­500 స్పర్శ దర్శనం టికెట్లు 275, రూ.300 అతి శీఘ్ర దర్శనం టికెట్లు 300, రూ.150 శీఘ్ర దర్శనం టికెట్లు 500 అందుబాటులోకి తీసుకువచ్చింది.

భక్తులు ఆర్టీసీ వెబ్‌సైట్‌ ద్వారా శ్రీశైలం వెళ్లేందుకు ప్రయాణ టికెట్లతోపాటు ఈ దర్శనం టికెట్లు కూడా బుక్‌ చేసుకోవచ్చును. వివిధ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి నిర్వహించే 95 ఆర్టీసీ బస్సుల్లోనూ ఈ టికెట్లను బుక్‌ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. శ్రీశైలం వెళ్లే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకే దేవదాయ శాఖతో కలసి ఈ ప్యాకేజీని ప్రవేశపెట్టామని ఆర్టీసీ ఎండీ సీహెచ్‌.ద్వారకా తిరుమలరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు