ఇదేందయ్యా లోకేష్‌.. ఫేక్‌ ప్రచారాలకు కేరాఫ్‌గా మారిన టీడీపీ!

8 Feb, 2023 09:14 IST|Sakshi

సాక్షి, విజయవాడ: టీడీపీ తప్పుడు ప్రచారాలకు కేరాఫ్‌ మారింది. ఉన్నది లేన్నట్టుగా.. జరగనిది జరిగినట్టుగా చూపిస్తూ సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తోంది. తాజాగా మరో తప్పుడు వార్తను సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై అక్కస్సు వెళ్లగక్కింది. కానీ, తీరా అది ఫేక్‌ అని తేలడంతో టీడీపీని నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. అటు, ఏపీఎస్‌ఆర్టీసీ కూడా టీడీపీ తప్పుడు ప్రచారంపై స్పందించి ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఇంతకీ ఏం జరిగిందంటే.. నారా లోకేష్‌ను కలిసిన ఓ ఏపీఎస్‌ఆర్టీసీ డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించారని టీడీపీ, లోకేష్‌ మద్దతుదారులు సోషల్‌ మీడియాలో ఓ పోస్టును పెట్టి వైరల్‌ చేశారు. అయితే, ఈ పోస్టుపై ఏపీఎస్‌ఆర్టీసీ యాజ్యమాన్యం స్పందించింది. తాము ఆ డ్రైవర్‌ను తొలగించలేదని స్పష్టం చేసింది. ఇది అస్యత ప్రచారం అని ఖండించింది. ఇలాంటి తప్పుడు ప్రచారానికి బాధ్యులైన టీడీపీ సోషల్‌ మీడియా నిర్వాహకులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇక, టీడీపీ పోస్టు చేసిన వార్త ఫేక్‌ అని తేలడంతో నారా లోకేష్‌ను నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు