ఘనంగా అరకు ఎమ్మెల్యే కుమారుడి వివాహ వేడుక

13 May, 2022 07:18 IST|Sakshi
నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న అరకు ఎంపీ మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, కుంభా రవిబాబు తదితరులు 

సాక్షి, అరకులోయ రూరల్‌: అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ కుమారుడు, వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి చెట్టి వినయ్‌ వివాహ వేడుక స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం ఘనంగా జరిగింది.

ఈ వివాహ వేడుకకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కుంభా రవిబాబు, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్‌ పర్సన్‌ స్వాతి రాణి, ట్రైకార్‌ చైర్మన్‌ బుల్లిబాబు, జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, మాజీ మంత్రి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే హైమావతి పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. అరకులోయ, పాడేరు తదితర ప్రాంతాలకు చెందిన ఉద్యోగ, ప్రజాసంఘాలు, వివిధ రాజకీయపార్టీల నేతలు పాల్గొన్నారు.  

చదవండి: (చికెన్‌ 312 నాటౌట్‌.. చరిత్రలోనే ఆల్‌టైం రికార్డు)

మరిన్ని వార్తలు