సీమలో రాతియుగపు ఆనవాళ్లు

18 Aug, 2020 13:34 IST|Sakshi
సూరబోయిన పాడు ప్రాంతంలో లభించిన వస్తువులు

వైవీయూ:  రాయలసీమ ప్రాంతంలో పురావస్తు ఆనవాళ్లపై యోగివేమన విశ్వవిద్యాలయం చరిత్ర, పురావస్తుశాఖ విభాగం ఆధ్వర్యంలో పరిశోధనలు గత కొంతకాలంగా జరుగుతూనే ఉన్నాయి.  ఈ విభాగంలో అకడమిక్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ రఘుయాదవ్‌ చేసిన పరిశోధనల్లో పలు  అంశాలు వెలుగులోకి వచ్చాయి.  

ఎథ్నో ఆర్కియాలజిస్టు అయిన ఈయన కర్నూలు జిల్లా కోడుమూరు మండలం, గూడూరు మండలాల సరిహద్దుల్లో వందల సంవత్సరాల క్రితం ధ్వంసమైన సూరబోయిన పాడు (ప్రస్తుతం ప్యాలకుర్తి గ్రామానికి 8 కి.మీ సమీపంలో) అనే పాడుబడిన ప్రదేశంలో నిర్వ హించిన క్షేత్ర పరిశోధనల్లో కొత్తరాతి యుగం నాటి పురావస్తు ఆధారాలు లభించాయి.  

మొత్తం నల్లరేగడి నేలలో విస్తరించిన ఈ ప్రాంతం వంక ఒడ్డున ఉంది. ఈ  వంక  తుంగభద్ర నది ఉపనది అయిన హంద్రీనీవలో కలుస్తుంది. ప్యాలకుర్తి గ్రామస్తులు ఈ పరిశోధక ప్రాంతాన్ని ‘పాటి’ మీదిగా పిలుస్తున్నారు.  పూర్వం ఈ ప్రాంతాన్ని సుధారపాడు అని పిలుచేవారని స్థానికుల అభిప్రాయం. కంభంపాటి సత్యనారాయణ గారి ఆంధ్రుల చరిత్ర –సంస్కృతిలో సూరబోయినపాడుగా పేర్కొన్నారు.    

ప్యాలకుర్తి, సూరబోయిన పాడు గ్రామాలను నివాసయోగ్యంగా మార్చేందుకు ఇక్కడ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు నాటి విజయనగర సామ్రాజ్యస్థాపకుడు అయి న మొదటి హరిహరరాయలు (క్రీ.శ. 1336– 1356) నరసింహ అనే వ్యక్తికి అధికారం ఇచ్చి నట్లు తెలుస్తోంది. విజయనగర సామ్రాజ్యం ప తనం అనంతరం ఈ గ్రామం శిథిలమై ఉంటుందని.. ఇందుకు సాక్షాలుగా ఇప్పటికీ అక్క డ శిథిలమై ఉన్న శివాలయం, ఆంజనేయస్వా మి గుడి, బుగ్గరామేశ్వరుని గుడి, చౌడమ్మ విగ్రహాలను పరిశోధకులు గుర్తించారు. 

లభించిన పూసలు ఒక రంధ్రాన్ని మాత్రమే కలిగి ఉన్నాయి. అయితే అవి విభిన్న ఆకారాలను కలిగి ఉన్నాయి.  స్థూపాకారం, గుండ్రంగా వలయాకారం, గొట్టపు ఆకారం, పీపా ఆకారంతో ఉన్నాయి. 

రాతి పనిముట్లు.. 
గుండ్రాళ్లు, నూరుడు రాళ్లు 
వడిసెల రాయి è రాతి గోలీలు 

మట్టిపాత్రలు.. 
ఎరుపు, నలుపు రంగులో గల కుండపెంకులు 
ఎరుపు రంగులోని కెటిల్‌ వంటి చిన్న మట్టికుండ 
ఎరుపు రంగులోని కుండ మూత, తొక్కుడు బిళ్ల ఆభరణాలు (పగడాలు, పచ్చలు, పూసలు, గాజులు) 
ఎర్రని పగడాలు è పచ్చలు 
స్టియటైట్‌ (మెత్తని రాయి) పూసలు 
టెర్రాకొట్ట (మట్టి) పూసలు 
తెల్లని శంఖుతో తయారైన పూసలు 
తెల్లని శంఖుతో తయారైన గాజులు (విరిగిపోయినవి) 
పెద్దసైజులో గల ఎర్రమట్టి ఇటుకలు, జంతువుల పళ్లు 
కొత్త రాతియుగం, మధ్య యుగ కాలం నాటి రాళ్లు, పూసలు లభ్యం 
కర్నూలు జిల్లా ప్యాలకుర్తి  సమీపంలో ఆనవాళ్లు లభ్యం 
వెలుగులోకి తెచ్చిన వైవీయూ అధ్యాపకుడు  

స్పష్టమైన ఆధారాలు లభించాయి.. 
మేము చేపట్టిన పరిశోధనల్లో స్పష్టమైన ఆధారాలు లభించాయి.  లభించిన పనిముట్ల ఆధారంగా శిథిలమైన సూరబోయినపాడు గ్రామప్రజలు కొత్తరాతియుగం నుంచి చారిత్రక యుగంలో మధ్యయుగ కాలం వరకు కూడా ఇక్కడ మానవ జీవనం కొనసాగి ఘనమైన చరిత్ర కలిగి ఉండేవని తెలుస్తోంది. వారి జీవన విధానం తెలియజెప్పేలా రాతి పనిముట్లు, మట్టిపాత్రలు, ఆభరణాలు లభ్యమయ్యాయ. – డాక్టర్‌ రఘుయాదవ్,  అకడమిక్‌ కన్సల్టెంట్, వైవీయూ 

మరిన్ని వార్తలు