అతడి కోసం హిజ్రాగా మారిన యువకుడు!

8 Aug, 2021 16:42 IST|Sakshi

సాక్షి, గిద్దలూరు(ఒంగోలు): ఆర్మీ జవాన్‌ వివాహాన్ని హిజ్రాలు అడ్డుకున్న సంఘటన గిద్దలూరు పట్టణంలో చోటుచేసుకుంది. శుక్రవారం జరిగిన ఈ సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాచర్ల మండలం పాలకవీడు గ్రామానికి చెందిన మగ్బూల్, అర్థవీడు మండలంలోని పాపినేనిపల్లెకు చెందిన వినీత్‌ క్లాస్‌మేట్స్‌ కాకుండా మంచి స్నేహితులు కూడా. అలా వీరిద్దరూ కలిసి ఆర్మీ సెలక్షన్స్‌కు వెళ్లేవారు. ఇద్దరూ నిత్యం మాట్లాడుకువారు. వారిలో మగ్బూల్‌ ఆర్మీకి ఎంపికవగా, వినీత్‌ ఎంపిక కాలేదు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం వినీత్‌ హిజ్రాగా మారి వినీతగా పేరు మార్చుకున్నాడు. అయినప్పటికీ మగ్బూల్‌తో స్నేహం కొనసాగిస్తూ వచ్చాడు. వారిద్దరి స్నేహాన్ని సహజీవనంగా కూడా మార్చుకున్నారు.

మగ్బూల్‌ ఆర్మీలో ఉన్నప్పటికీ వినీతతో తరచూ ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేవాడు. సెలవుపై వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి సరదాగా తిరిగేవారు. ఇటీవల సెలవుపై వచ్చిన మగ్బూల్‌.. గిద్దలూరు పట్టణానికి చెందిన మహిళను వివాహం చేసుకునేందుకు నిశ్చయించుకున్నాడు. శుక్రవారం ఓ కల్యాణ మండపంలో వివాహం చేసుకుంటుండగా, సమాచారం తెలుసుకున్న హిజ్రా వినీత.. పలువురు హిజ్రాలతో కలిసి అక్కడకు చేరుకుని మగ్బూల్‌ వివాహాన్ని అడ్డుకుంది. తననే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. మగ్బూల్‌ నిరాకరించడంతో ఆత్మహత్యకు పాల్పడగా, కర్నూలు జిల్లాలోని నంద్యాల వైద్యశాలకు తరలించి చికిత్స చేయిస్తున్నట్లు సమాచారం.   మగ్బూల్ కోసమే వినీత్‌ హిజ్రాగా మారినట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు