తమిళ పత్రిక కథనం: చంద్రబాబూ.. ఎందుకీ కడుపుమంట..?

10 Oct, 2020 03:28 IST|Sakshi
తమిళ పత్రిక క్లిప్పింగ్‌

జగన్‌ రాజకీయ చాతుర్యంపై టీడీపీ నేతల ప్రశంస

తమిళ దినపత్రికలో కథనం

సాక్షి, చెన్నై: ‘గడిచిన ఎన్నికల సమయంలో నీవు తీసుకున్న తెలివితక్కువ నిర్ణయాలతో నష్టపోయాం, రాజకీయ చాతుర్యంతో ముందుకు సాగిపోతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి నీ కెందుకీ కడుపుమంట’ అని టీడీపీ శ్రేణులే చంద్రబాబు తీరుపై వ్యాఖ్యానిస్తున్నట్టుగా  తమిళ దినపత్రిక ‘దినమలర్‌’ శుక్రవారం ఒక కథనాన్ని ప్రచురించింది. ఇరుగూ పొరుగూ శీర్షిక కింద ‘ఏన్‌ ఇంద వయిట్రెరిచ్చల్‌’ (ఎందుకీ కడుపు మంట) పేరిట ప్రచురించిన ఆ కథనంలోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘చేతికి వచ్చిన మంచి అవకాశాన్ని (ఎన్‌డీఏ కూటమి) చేజార్చుకుని ఇప్పుడు కుయ్యో మొర్రో అంటూ ఆక్రోశిస్తే ఏం ప్రయోజనమని  టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆ పార్టీ నేతలే విరక్తితో వ్యాఖ్యానాలు చేస్తున్నారు.  (రోజువారీ విచారణకు బాబు అక్రమాస్తుల కేసు)

ఎన్‌డీఏ కూటమిలో టీడీపీ కొనసాగి, కేంద్రంలో భాగస్వామిగా కూడా వ్యవహరించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ కూటమి నుంచి చంద్రబాబు వైదొలిగారు. తొలుత బీజేపీ ప్రభుత్వంతో అంటీముట్టనట్టుగా వ్యవహరించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కొంతకాలంగా ఆ పార్టీకి చేరువవుతూ వస్తున్నారు. ఎన్‌డీఏ కూటమిలో చేరితే కేంద్ర కేబినెట్‌ పదవి కూడా దక్కే అవకాశం ఉంది. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు.. వైఎస్‌ జగన్‌ ఏపీ ప్రజలకు ద్రోహం చేస్తున్నాడు అంటూ గగ్గోలు పెడుతున్నారు. తెలివివంతుడైన బిడ్డ దూసుకుపోతున్నాడు.. ఈయనకెందుకీ కడుపుమంట అంటూ టీడీపీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు’ అని ఆ కథనంలో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు