‘ఉద్యోగం పోతుందనే ఆత్మహత్యాయత్నం’ 

22 Apr, 2021 12:40 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న ఆశా కార్యకర్త అనిత

విలేకరుల సమావేశంలో ఆశా కార్యకర్త అనిత 

రాప్తాడు: ‘‘ఉద్యోగం పోతుందనే భయంతోనే నేను ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాను. నన్ను ఎవరూ బెదిరించలేదు. దీన్ని ఎవరూ రాజకీయం చేయవద్దండి. పరిటాల సునీత దీన్ని రాజకీయం చేయడం చాలా బాధగా ఉంది’’ అని ఎం.చెర్లోపల్లి గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త కపాడం అనిత అన్నారు. బుధవారం ఆమె రాప్తాడులో విలేకరులతో మాట్లాడారు. తాను పది సంవత్సరాలుగా ఆశా కార్యకర్తగా పని చేస్తున్నానని, గ్రామంలో కొందరు టీడీపీ నాయకులు తన ఉద్యోగం పోతుందని చెప్పడంతో భయాందోళనతో ఈ నెల 19న విష ద్రావకం తాగానన్నారు.

వెంటనే తనను అనంతపురంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రికి తరలించి చికిత్స చేయించారన్నారు. అయితే తాను ఆస్పత్రిలో ఉన్న సమయంలో మాజీ మంత్రి పరిటాల సునీత పరామర్శించారని, ఆ తర్వాత దీన్ని రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నించారన్నారు. తనను రాజకీయ పావుగా వాడుకునేందుకు ప్రయత్నించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. తనను గ్రామంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు ఎవరూ ఎలాంటి వేధింపులకు గురి చేయలేదన్నారు. ఇంతకు మించి ఈ ఘటనపై రాజకీయ రాద్ధాంతం తగదన్నారు.
చదవండి:
అవినీతి గని.. నాటి సీఎం రిలీఫ్‌ నిధి
ప్రకృతి ఆరాధన: చెట్టు మానులే దేవతామూర్తులు..

మరిన్ని వార్తలు