సీఎం జగన్‌ను కలిసిన ఏషియన్‌ గేమ్స్‌ క్రీడాకారులు

20 Oct, 2023 13:45 IST|Sakshi

సాక్షి, గుంటూరు: అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న ఏపీ క్రీడాకారులను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి అభినందించారు. ఏషియన్‌ గేమ్స్‌లో పాల్గొన్న ఏపీ క్రీడాకారులు కోనేరు హంపి, బి.అనూష, యర్రాజీ జ్యోతి.. సీఎం జగన్‌ను ఇవాళ క్యాంప్‌ కార్యాలయంలో కలిశారు.

క్రీడాకారుల్ని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా దగ్గరుండి సీఎం జగన్‌కు కలిపించారు. ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో సాధించిన పతకాలను విజేతలు సీఎం జగన్‌కు చూపించారు. స్పోర్ట్స్‌ పాలసీ ప్రకారం క్రీడాకారులకు ఇచ్చే నగదు పురస్కారాన్ని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. మొత్తం రూ. 4.29 కోట్లను క్రీడాకారులకు ప్రభుత్వం అందించింది.

ఇదీ చదవండి: ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు.. క్యూలైన్లు ఫుల్‌

మరిన్ని వార్తలు