వలంటీర్ల కథ చూస్తాం.. అలా చేస్తే రూ.10వేల పారితోషికం

30 Mar, 2021 04:05 IST|Sakshi

వారి లోపాలు గుర్తించి చెబితే రూ.10 వేల పారితోషికం  

మద్యం రేట్లు తగ్గించాలి 

టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలో అచ్చెన్నాయుడు 

తిరుపతి అర్బన్‌: రాష్ట్రంలో వలంటీర్ల కథ చూస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం తిరుపతిలోని పార్టీ కార్యాలయం ఆవరణలో సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. వలంటీర్ల వ్యవస్థ దండగ అన్నారు. టీడీపీ కార్యకర్తలు వలంటీర్ల లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించి 7557557744 నంబర్‌కు వాట్సాప్‌ చేస్తే వారి కథ చూసుకుంటామన్నారు.

లోపాలు గుర్తించి చెప్పిన వారికి రూ.10వేల పారితోషికం ఇస్తామని చెప్పారు. మద్యం రేట్లు ప్రభుత్వం పెంచేస్తుందని.. తగ్గించాలని కోరారు. తిరుపతి ఎన్నికల్లో టీడీపీ విజయానికి కలసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్యే రామానాయుడు, పలువురు ఎమ్మెల్సీలు, స్థానిక మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ చైర్మన్‌ నరసింహయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు