గుండెపోటుతో ఆత్మకూరు సీఐ మృతి

21 Mar, 2023 11:11 IST|Sakshi
సీఐ నాగేశ్వరరావు (ఫైల్‌ )

సాక్షి, ఆత్మకూరు(శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): ఆత్మకూరు సీఐ మల్లి నాగేశ్వరరావు (48) గుండెపోటుతో మృతి చెందారు. ఆరు నెలల క్రితమే అమరావతి నుంచి బదిలీపై వచ్చి ఆత్మకూరు సీఐగా బాధ్యతలు చేపట్టారు.

విధుల్లో భాగంగా సోమవారం మర్రిపాడు మండలానికి ఓ కేసు విషయమై వెళ్లి విచారణ చేసి వచ్చారు. మధ్యాహ్నం ఇంటికి వెళ్లి భోజ­నం చేసిన అనంతరం తీవ్ర గుండెపోటుకు గుర­య్యా­రు. ప్రాథమిక చికిత్స అనంతరం నెల్లూరుకు తరలించే క్రమంలో ఆయన మృతి చెందారు.  

మరిన్ని వార్తలు