ఎస్‌ఐపై యువకుల దాడి

18 Jan, 2021 13:38 IST|Sakshi

సాక్షి, విజయనగరం: తమను అడ్డుకున్న ఎస్‌ఐతో గొడవకు దిగారు ఇద్దరు యువకులు. జనం రద్దీ ఎక్కువగా ఉన్నచోట బైక్‌ని అతివేగంగా నడపడమే కాకుండా.. వారించిన ఎస్‌ఐపై దాడి చేశారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో గరుగుబిల్లి మండలం ఖడ్గవలసలో సోమవారం చోటుచేసుకుంది. పాచిపెంట ఎస్‌ఐ రమణపై దాడి చేసిన ఆ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బైక్‌పై వేగంగా వెళ్తున్న వారిని వారించినందుకు ఆయనపై యువకులు దాడికి దిగినట్లు తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు