నెల్లూరులో దారుణం.. కన్న బిడ్డలపై క్షుద్ర పూజల కలకలం!

15 Jun, 2022 17:07 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: జిల్లాలోని పెద్దిరెడ్డిపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. క్షుద్ర పూజల పేరుతో పిల్లలకు చంపేందుకు కన్న తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. వివరాల ప్రకారం.. పెద్దిరెడ్డిపల్లి చెందిన వేణుకు పెళ్లి అయిన 12 ఏళ తర్వాత పూర్విక, పునర్విక(4) కవల పిల్లలు జన్మించారు. కాగా, తండ్రి వేణు.. తన ఇంట్లో ఇద్దరు పిల్లలను కూర్చోపెట్టి క్షుద్రపూజలు చేశాడు. అనంతరం, చిన్న పాప నోట్లో కుంకుమ పోసి తండ్రి వేణు.. పాప గొంతునులిమాడు.

ఈ క్రమంలో పిల్లలిద్దరూ పెద్దగా కేకలు పెట్టడంతో స్థానికులు పాపను రక్షించారు. కాగా, పాప పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించడంతో పారిపోయిన వేణును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు. అయితే, వేణు.. శాంతి పూజల కోసమా లేక క్షుద్ర పూజల కోసం ఇలా చేశాడా.. అనేది తెలియాల్సి ఉంది. కన్న బిడ్డలనే ఇలా వేణు చంపాలని చూడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

ఇది కూడా చదవండి: వింత ఆచారం.. సమాధులే దేవాలయాలు! 

మరిన్ని వార్తలు