దివ్య కేసులో ఊహించని ట్విస్ట్‌లు: ఆడియోలు లీక్‌

16 Oct, 2020 17:14 IST|Sakshi

పెళ్లి విషయం దాచలేకపోతున్నా : దివ్వ

సాక్షి, విజయవాడ : ప్రేమోన్మాదానికి బలైపోయిన విజయవాడ ఇంజనీరింగ్‌ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన నాగేంద్రతో బాధితురాలు మాట్లాడిన ఫోన్‌ కాల్స్‌ లీకవుతున్నాయి. దీనిని బట్టి చూస్తే వారిద్దరికీ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా లీకైన ఆడియోలో పెళ్లి విషయం దాచిపెట్టలేక తీవ్ర సంఘర్షణకు గురైనట్లు దివ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకుముందులా అందరితో కలిసి సంతోషంగా ఉండలేకపోతున్నా అని, మానసిక కుంగుబాటుకు గురవుతున్నా అని నాగేంద్రతో తన బాధను పంచుకున్నారు. తాను త్వరగా అప్‌సెట్‌ అవుతున్నాఅని, ఇలా ఎందుకు ఉంటున్నానో తనకు అర్థం కావడంలేదని ఫోన్‌లో విలపించారు. తనకు నాగేంద్రతో పాటు భవిష్యత్‌ కూడా ముఖ్యమేనని చెప్పారు. (ఎవరి గొంతు వాళ్లే కోసుకున్నాం: నాగేంద్ర)

తనలో ఎన్నడూ లేని మార్పులు వస్తున్నాయని, ఎవరితో మాట్లాడాలి, ఎవరి సలహాలు తీసుకోవాలో కూడా అర్థంకావడంలేదని దివ్య వాపోయారు. అంతేకాకుండా వివాహం అనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఎవరితోనూ చర్చించలేకపోతున్నా అని నాగేంద్రతో ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలావుండగా.. తాజాగా తేజస్వినికి చెందిన ఓ ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో ద్వారా మరికొన్ని విషయాలు వెల్లడవుతున్నాయి. నాగేంద్రతో రెండేళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో కొనసాగానని, ఆ తరువాత నాగేంద్రలోని సైకో గురించి తెలిసిందని దివ్య తెలిపారు. ఓ మహిళ కారణంగా తను మోసపోయానని వీడియో వెల్లడించారు. తాను చేసిన తప్పిదాల కారణంగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నాఅని, తన జీవితం ఏటు పోతుందో కూడా అర్థకావడంలేదని పేర్కొన్నారు. తనకు బెదింపు కాల్స్‌, మెస్సెజ్‌లు వస్తు‍న్నాయని వీడియో ద్వారా రికార్డు చేసుకున్నారు. (మంగళగిరిలో పెళ్లి చేసుకున్నాం: నాగేంద్ర)

మరోవైపు తామిద్దరం వివాహం చేసుకున్నామని, అది వారి తల్లిదం‍డ్రులకు ఇష్టం లేకపోవడంతో ఇద్దరం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నామని నిందితుడు నాగేంద్ర చెబుతున్నాడు. అయితే తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఫోన్‌కాల్స్‌ రికార్డులు లీకవ్వడంతో కేసు మరో మలుపు తిరిగింది. దీంతో పోలీసులకు ఈ కేసు సవాలుగా మారింది. లీకైన ఆడియోలు, ఫోన్‌ కాల్స్‌ డేటా ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. కాగా నగరంలోని క్రీస్తురాజపురం కొండ ప్రాంతానికి చెందిన వంకాయలపాటి దివ్య తేజశ్విని(22) పై బుడిగి నాగేంద్రబాబు (25) అలియాస్‌ చిన్నస్వామి కత్తితో దాడిచేసి హతమార్చిన సంగతి తెలిసిందే.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా