మాన్సాస్‌ ట్రస్ట్‌ కార్యకలాపాలపై ఆడిట్‌కు రంగం సిద్ధం

5 Jul, 2021 12:37 IST|Sakshi

మాన్సాస్‌ ఆడిట్ 2004-05 నుంచి జరగాల్సి ఉంది

పూర్తిస్థాయి రికార్డులు ఇస్తేగానీ ఆడిట్ చేయలేం

జిల్లా ఆడిట్‌ అధికారి హిమబిందు

సాక్షి, విజయనగరం: మాన్సాస్‌ ట్రస్ట్‌ కార్యకలాపాలపై జిల్లా ఆడిట్‌ అధికారి ఆధ్వర్యంలో ఆడిటింగ్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. మాన్సాస్‌ కార్యాలయానికి అధికారులు సోమవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆడిట్‌ అధికారి హిమబిందు మీడియాతో మాట్లాడుతూ, మాన్సాస్‌ ఆడిట్ 2004-05 నుంచి జరగాల్సి ఉందని పేర్కొన్నారు.

ఆడిట్‌కి సంబంధించిన మొత్తం రికార్డులు అడిగామని.. ప్రస్తుతానికి కొన్ని హార్డ్‌కాపీలు మాత్రమే అందజేశారని తెలిపారు. పూర్తిస్థాయి రికార్డులు ఇస్తేగానీ ఆడిట్ చేయలేమని ఆమె తెలిపారు. మిగిలిన రికార్డ్స్ కోసం మాన్సాస్‌ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు