ఐఎస్‌డబ్ల్యూ ఎస్పీగా రమేష్‌రెడ్డి

9 Feb, 2021 05:12 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డిని ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ (ఐఎస్‌డబ్ల్యూ)కు ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి అర్బన్‌ ఎస్పీగా రమేష్‌రెడ్డిని తప్పించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ సిఫారసు చేయడంతో ఆయన్ను ప్రభుత్వం వెయిటింగ్‌లో పెట్టింది. రమేష్‌రెడ్డిని ఐఎస్‌డబ్ల్యూ ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు ఇచ్చింది.  

మరిన్ని వార్తలు