అద్దంకిలో టీడీపీ బరితెగింపు..

4 Mar, 2021 11:49 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని కారులో తీసుకొచ్చి

బలవంతంగా విత్‌డ్రా  చేయించినఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ 

ఎమ్మెల్యే చర్యను తీవ్రంగా ఖండించిన వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య

అద్దంకి: అద్దంకిలో టీడీపీ బరితెగించింది. ఏకంగా టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిని తన కారులో ఎక్కించుకువచ్చి నామినేషన్‌ను విత్‌డ్రా చేయించారు. టీడీపీ ఎమ్మెల్యే దిగజారుడుతనాన్ని వైఎస్సార్‌సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి కృష్ణచైతన్య విలేకర్ల సమావేశంలో తీవ్రంగా ఖండించారు. వివరాల్లోకి వెళ్తే.. అద్దంకి నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 8వ వార్డులో వైఎస్సార్‌సీపీ తరఫున ఇద్దరు, టీడీపీ తరపున ఇద్దరు నామినేషన్లను దాఖలు చేశారు.

నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారం ప్రారంభం కాగా టీడీపీ తరపున 8వ వార్డుకు నామినేషన్‌ వేసిన ఇద్దరు అభ్యర్థులు అదే రోజున స్వచ్ఛందంగా నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో టీడీపీ తరఫున 8వ వార్డుకు పోటీ లేకపోవడాన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే వైఎస్సార్‌సీపీ తరపున బీఫారం తీసుకుని నామినేషన్‌ వేసిన అభ్యర్థి పరశురాంను ఉపసంహరణ సమయానికి ఒక నిమిషం మాత్రమే సమయం ఉండగా తన సొంత కారులో తీసుకుని వచ్చి నామినేషన్‌ను ఉపసంహరణ చేయించారు.   

ఆధారాలున్నాయి, సీరియస్‌గా తీసుకుంటాం.. 
టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ఇంతగా దిగజారుతాడని అనుకోలేదని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన చెంచు గరటయ్య ఖండించారు.  8వ వార్డుకు మా పార్టీ తరఫున బీ ఫారం ఇచ్చిన ఎస్టీ అభ్యర్థిని ప్రలోభపెట్టి తన కారులో ఎక్కించుకుని వచ్చి నామినేషన్‌ ఉపసంహరణ చేయించడం దారుణమని మండిపడ్డారు. రెండేళ్లుగా ఇంట్లో కూర్చోని ప్రజల గురించి ఏ మాత్రం పట్టించుకొని ఎమ్మెల్యే రవికుమార్‌..ఇప్పుడు చంద్రబాబు వద్ద షో చేయడం కోసమే ఇదంతా చేస్తున్నాడని ధ్వజమెత్తారు. 8వ వార్డుకు నామినేషన్లు వేసిన మీ అభ్యర్థులు వారే వచ్చి నామినేషన్లు ఉపసంహరించుకోవడం నీకు తెలియదా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటామని, ఈ సంఘటనకు సంబంధించి వీడియో క్లిప్పింగ్స్‌ మా దగ్గరున్నాయని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని పేర్కొన్నారు. మిగిలిన 19 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ విజయబావుటా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
చదవండి
చంద్రబాబు మాట.. అబద్ధాల మూట 
కట్టుకథ అల్లేసింది.. సీసీ టీవీ పట్టేసింది..

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు