అమరావతి పేరిట దొంగ దీక్షలు

9 Jan, 2021 04:39 IST|Sakshi
దీక్షల్లో పాల్గొన్న దళిత సంఘాల నాయకులు

బాబు భూ కుంభకోణాలను కప్పి పుచ్చుకునేందుకే కృత్రిమ ఉద్యమం 

మండిపడ్డ బహుజన పరిరక్షణ సమితి నేతలు

తాడికొండ: అమరావతిలో భూ కుంభకోణాలకు పాల్పడిన చంద్రబాబు, ఆయన బినామీలు రైతుల పేరిట కృత్రిమ ఉద్యమం నడిపిస్తున్నారని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. పత్తా లేకుండా పోయిన టీడీపీని బతికించుకునేందుకు బాబు అండ్‌ కో కొంగజపం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు శుక్రవారం 101వ రోజుకు చేరాయి. పలువురు నాయకులు మాట్లాడుతూ.. అమరావతి ఉద్యమంలో రైతులు స్వచ్ఛందంగా పాల్గొంటున్న దాఖలాలు లేవన్నారు.

విరాళాల రూపంలో టీడీపీ నాయకులు కోట్లాది రూపాయలు ఇచ్చి మరీ  అమరావతి పోరాటాన్ని నడిపిస్తుంటే.. బహుజనుల ఉద్యమం కూటి కోసం, ఇంగ్లిష్‌ చదువుల కోసం, గూడు కోసం చేస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నత్తా యోనారాజు, ఎస్‌డీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గురునాథం, దళిత క్రిస్టియన్‌ రైట్స్‌ జాతీయ అధ్యక్షుడు పెరికే వరప్రసాద్, ఏంఏసీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు బేతపూడి సాంబయ్య, నూతక్కి జోషి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు