బాబును రాజకీయ బహిష్కరణ చేయాలి

17 Jan, 2021 04:40 IST|Sakshi
రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న బహుజన పరిరక్షణ సమితి నేతలు

బహుజన పరిరక్షణ సమితి సంఘాల పిలుపు

మూడు రాజధానులకు మద్దతుగా 109వ రోజు రిలే నిరాహార దీక్షలు 

తాడికొండ: ఆర్థిక అసమానతలు, కుల అసమతుల్యతను పెంచేలా రాజ్యాంగ విలువలకు తిలోదకాలిచ్చి పేదల సంక్షేమాన్ని అడ్డుకుంటున్న చంద్రబాబును రాజకీయాల నుంచి బహిష్కరించాలని బహుజన పరిరక్షణ సమితి సంఘాల నాయకులు మండిపడ్డారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా 109వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు పలువురు నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.

అమ్మ ఒడి, పేదలకు ఇళ్ల స్థలాలు, ఇంగ్లిష్‌ మీడియం విద్య, మూడు రాజధానులను అడ్డుకొనేందుకు రాష్ట్రంలో పెద్ద కుట్ర జరుగుతోందని, 85 శాతం ఉన్న బహుజనులను దెబ్బకొట్టేందుకు పనిచేస్తున్న బాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. ఇకనైనా తన తప్పులను తెలుసుకొని చంద్రబాబు కోర్టుల్లో పేదల సంక్షేమాన్ని అడ్డుకొనేందుకు వేసిన కేసులను ఉపసంహరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి నాయకులు మల్లవరపు సుధారాణి, ఇందుపల్లి సుభాషిణి, నత్తా యోనారాజు, మాదిగాని గురునాధం, జూపూడి బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.  

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు