విశాఖ ఉక్కు యావత్‌ ఆంధ్రుల హక్కు

6 Mar, 2021 04:51 IST|Sakshi
రిలే నిరాహార దీక్షలలో పాల్గొన్న నాయకులు

157వ రోజు రిలే నిరాహార దీక్షల్లో బహుజన పరిరక్షణ సమితి నాయకులు 

తాడికొండ: ఆంధ్ర రాష్ట్రానికి పరిపాలన రాజధానిగా రూపాంతరం చెందనున్న విశాఖపట్నంలోని ఉక్కు కర్మాగారం యావత్‌ ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అని బహుజన పరిరక్షణ సమితి నాయకులు నినదించారు. మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో 157వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు పలువురు నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.

కులం కోసం చేస్తున్న అమరావతి ఉద్యమం దెబ్బతిని స్థానిక ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడటంతో టీడీపీ నాయకులతో కలిసి జనసేన, వామపక్ష పార్టీలు విశాఖపై కపట ప్రేమను ఒలకబోస్తూ విశాఖ ఉక్కు ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని ఉనికిని కాపాడుకొనేందుకు యతి్నస్తున్నారన్నారు. రాజ్యాంగ పరంగా అంబేడ్కర్‌ ప్రసాదించిన హక్కుల సాధనే లక్ష్యంగా చిత్తశుద్ధితో చేస్తున్న బహుజన ఉద్యమంతో పాటు విశాఖ ఉక్కు ఉద్యమానికి బహుజన పరిరక్షణ సమితి మద్దతిస్తుందని, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బహుజనులందరినీ కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పారు. 

మరిన్ని వార్తలు