బినామీ రైతులది మొసలి కన్నీరు

16 Feb, 2021 06:18 IST|Sakshi
దీక్షల్లో పాల్గొన్న బహుజన పరిరక్షణ సమితి నాయకులు

మండిపడ్డ బహుజన పరిరక్షణ సమితి నేతలు 

తాడికొండ: విశాఖలో రాజధాని వద్దన్న అమరావతి బినామీ రైతులు.. ఉక్కు ఉద్యమానికి మద్దతంటూ మొసలి కన్నీరు కార్చడం హేయనీయమని బహుజన పరిరక్షణ సమితి సంఘాల నాయకులు మండిపడ్డారు. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో 139 రోజు పలువురు ప్రసంగించారు.

విశాఖలో రాజధాని వద్దు.. మాకే రాజధాని కావాలని ఏడాదికి పైగా ఉద్యమాలు చేస్తున్న వీరు.. ఉక్కు ఉద్యమానికి మద్దతు పలికేందుకు విశాఖకు వెళ్లడం ఉక్కు ఉద్యమాన్ని అవమాన పర్చడమేనన్నారు. రాజధాని పేరిట చంద్రబాబు కేవలం గ్రాఫిక్స్‌ చూపించి రియల్‌ ఎస్టేట్‌ చేశాడని తేటతెల్లం కావడంతోనే  అన్ని ఎన్నికల్లో ప్రజలు దిమ్మతిరిగే దెబ్బ కొట్టారని ఎద్దేవా చేశారు. నేతలు నత్తా యోనారాజు, మాదిగాని గురునాధం, ఊపూరి ఆదాం తదితర దళిత నాయకులు, మహిళలు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు