సంఘ విద్రోహ శక్తి చంద్రబాబు

12 Jan, 2021 04:28 IST|Sakshi
దీక్షలో పాల్గొన్న దళిత నేతలు

బహుజన పరిరక్షణ సమితి

తాడికొండ: అమరావతి ఉద్యమం పేరిట  అరాచక శక్తులను  తయారు చేస్తూ చంద్రబాబు సంఘ విద్రోహ శక్తిగా మారాడని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. రైతుల ముసుగులో అమరావతిలో బినామీ ఉద్యమం నడిపిస్తున్నారని,  మూడు రాజధానులకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మద్దతు ఉందని, వద్దని అడ్డుపడుతోంది కేవలం ఒక్క కులమేనని వారు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి 104వ రోజుకు చేరాయి.

పలువురు దళిత నేతలు మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో నిజంగా అభివృద్ధి జరిగితే తాడికొండలో శ్రీదేవి, మంగళగిరిలో ఆర్కేలను ఎమ్మెల్యేలుగా వైఎస్సార్‌సీపీ నుంచి ప్రజలు ఎందుకు గెలిపించారో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ఎల్లో మీడియాలో కనిపించడం, కోర్టుల్లో కేసులు వేసి ప్రభావితం చేయడం వంటివి తప్ప అమ రావతి ఉద్యమంలో అజెండా లేదని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేసేలా హైకోర్టు తీర్పు ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు  చెంపపెట్టు అన్నారు. 

మరిన్ని వార్తలు